ATP: ఉరవకొండ మండల కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ పక్కన నూతనంగా నిర్మించిన అన్న క్యాంటీన్ భవనాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులను, వసతులను స్వయంగా పర్యవేక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరలోనే ఈ క్యాంటీన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి తెలిపారు.