AKP: రాజయ్యపేటను సందర్శించే వైసీపీ నాయకులు 48 మందికి షరతులతో అనుమతి మంజూరు చేసినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా తెలిపారు. ర్యాలీ, రోడ్ షో, భారీ సమావేశం నిర్వహించడానికి అనుమతి లేదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా చట్టాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీడియా సమావేశం నిర్వహించేటప్పుడు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయరాదన్నారు.