W.G: రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని రేపు ఆకివీడు హోల్ సేల్ చేపల మార్కెట్కు సెలవు ప్రకటిస్తున్నట్లు శ్రీ రామ భక్తాంజనేయ చేపల కమిషన్ వర్తక సంఘం వెల్లడించింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు షేక్ సుభాని మాట్లాడుతూ.. ముందస్తు తీర్మానం ప్రకారం ఆ రోజు వ్యాపార లావాదేవీలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. రైతులు, వర్తకులు సహకరించాలని కోరారు.