NTR: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ వారిని అవధూత దత్త పీఠాధిపతి పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి దర్శించుకున్నారు. స్వామివారికి ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వీ.కే. సీనా నాయక్ ఘనస్వాగతం పలికారు. స్వామివారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం అందించారు.