AKP: మరో రంగారెడ్డి జిల్లాగా అనకాపల్లిని తీర్చి దిద్దుతానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఒకప్పుడు దేశంలో రంగారెడ్డి జిల్లా బాగా వెనుకబడి ఉండేదని ఆయన పేర్కొన్నారు. ‘ఉమ్మడి ఏపీలో రంగారెడ్డి జిల్లాను ఏ విధంగా అభివృద్ధి చేసి అత్యంత ధనిక జిల్లాగా తయారుచేశానో అదేవిధంగా అనకాపల్లిని అభివృద్ధిలోకి తీసుకువస్తా’ అని అన్నారు.