ADB: మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు రూపొందించిన ‘డోస్’ షార్ట్ ఫిల్మ్ పోస్టర్ను జిల్లా SP అఖిల్ మహాజన్ శనివారం ఆవిష్కరించారు. సామాజిక సమస్యల పరిష్కారంలో లఘు చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన కొనియాడారు. యువత గంజాయి, మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఆయన సూచించారు. ఆదివారం ఉదయం 9 గంటలకు ఈ చిత్రం విడుదల కానుందని తెలిపారు.