TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా అధికారులు మరోసారి సాక్షులను విచారించనున్నారు. యుగతులసి ఫౌండేషన్ ఛైర్మన్, టీటీడీ మాజీ సభ్యులు కె.శివకుమార్‌కు సిట్ నోటీసులు జారీ చేసింది. మే 28న కమాండ్ కంట్రోల్ సెంటర్లో విచారణకు హాజరుకావాలని శివకుమార్‌కు నోటీసులు ఇచ్చింది.