NZB: జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యా వంతులు, ప్రజలు అందరూ జనగణన స్వీయ నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జనగణన స్వీయ నమోదు కోసం ఈ నెల 26 నుంచి మే 10 వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుందన్నారు. https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఎవరికి వారు జనగణన స్వీయ నమోదు చేసుకోవచ్చని తెలిపారు.