BPT: రేపల్లెలో ఆదివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. 11కేవీ టౌన్ 5వ ఫీడర్ మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. దీంతో పీటేరు రోడ్డు, అంకమ్మ చెట్టు, పెద్ద మసీదు, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, అలీ నగర్, తాలూకా ఆఫీసులు, రైల్వే స్టేషన్ రోడ్డు తదితర ప్రాంతాల్లో కరెంట్ ఉండదని డిప్యూటీ ఈఈ శ్యామ్ సుధాకర్ బాబు చెప్పారు.