W.G: పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామపంచాయతీలో కలిదిండి సూర్యనారాయణ రాజు వ్యవసాయ క్షేత్రంలో మంగళవారం కలెక్టర్ నాగరాణి కొబ్బరి మొక్కలను నాటారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద సన్న, చిన్నకారు రైతుల ఆర్థిక అభివృద్ధికి పండ్ల తోటల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 25 సెంట్లు నుండి ఐదు ఎకరాల భూమి కలిగిన ప్రతి ఒక్క రైతు అర్హులన్నారు.