కోనసీమ: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన రథం దగ్ధమైన విషయం తెలిసిందే. ఆ శకలాల నిమజ్జనం కార్యక్రమాన్ని వాయిదా వేశారు. రథం శకలాలు నిమజ్జనాన్ని శనివారం నిర్వహించాలని నిర్ణయించారు. రథం దగ్ధం చేసిన దోషులను పట్టుకోకుండా నిమజ్జనం ఎలా చేస్తారంటూ హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఛలో అంతర్వేదికి పిలుపు నివ్వడంతో వాయిదా వేశారు.