KRNL: గూడూరు మండలం పొన్నకల్లు గ్రామంలో గడ్డివాములు అగ్నికి ఆహుతైన ఘటనను కర్నూలు MP నాగరాజు ఇవాళ పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నారు. రాజకీయ కక్షల కారణంగానే ఈ ఘటన జరిగిందని బాధితులు తెలుపగా, పూర్తి స్థాయి విచారణ చేపట్టి న్యాయం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. రాజకీయ కక్షలకు పాల్పడితే సహించేది లేదన్నారు.