E.G: రాజానగరం టీడీపీ కార్యాలయంలో రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీ సృజనాత్మకత & సాంస్కృతిక కమిషన్ ఛైర్పర్సన్ తేజస్వితో కలిసి గురువారం ‘అమరావతి చిత్ర కళా వీధి’ పోస్టర్ను ఆవిష్కరించారు. ఏప్రిల్ 4న రాజమండ్రిలో ‘అమరావతి చిత్ర కళా వీధి’ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కళా ఉత్సవం ఏపీలోని కళాకారులందరికీ ఒక ఆశాకిరణంలా నిలుస్తుందన్నారు.