తూ.గో: గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో సాయిబాబా గుడి హుండిని కొల్లగొట్టి సొమ్ము అపహరించినట్లు గుడి కమిటీ మెంబర్ సూర్య ప్రకాష్ 3వ తేదీన గోకవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందని ఎస్ఐ పవన్ కుమార్ తెలిపారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అదే గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్‌ను అదుపులోని తీసుకుని రూ. 9వేల రికవరీ చేశామన్నారు.