అన్నమయ్య: మదనపల్లెకు చెందిన వృద్ధ దంపతులు తమ ఇంటి ఆస్తిని కుమార్తె మోసపూరితంగా తన పేరుకు రిజిస్ట్రేషన్ చేసుకుందని ఆరోపిస్తూ సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇంటి మరమ్మతుల కోసం లోన్ ఇప్పిస్తామని చెప్పి సంతకాలు తీసుకుని ఆస్తిని రిజిస్టర్ చేసుకుందని బాధితులు పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్‌ను రిజిస్ట్రేషన్ రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు.