KKD: ఉప్పాడలో శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేసిన శిలాఫలకాలు పిఠాపురంలో భద్రపరిచామని దేవాదాయశాఖ జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్ సుబ్బారావు తెలిపారు. వాటిని తమ శాఖకు చెందిన టూరిజం గెస్ట్ హౌస్లో ఉంచామన్నారు. వాటిని రోడ్డుపై వదిలేస్తే ఎవరైనా పాడుచేస్తారన్న భావనతో భద్రపరచామని, పూర్తిస్థాయిలో ఆలయాల వద్ద త్వరలోనే ఏర్పాటు చేస్తామన్నారు.