VZM: గంట్యాడ మండల కేంద్రంలో శనివారం ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ హేమలత ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది శనివారం నిర్వహించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి పలు నినాదాలు చేస్తూ ప్రధాన వీధుల్లో ర్యాలీ జరిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పొగాకు వినియోగం వల్ల కలిగే అనర్ధాలు గురించి వివరించారు.