ELR: కైకలూరు మండల సర్వసభ్య సమావేశం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగింది. ఎంపీపీ పీ.వెంకట కృష్ణ మోహన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గోపవరం కాలువపై నూతనంగా నిర్మిస్తున్న వంతెన నిర్మాణానికి రూ. 2.50 కోట్లు మంజూరు అయ్యాయన్నారు.