ASR: డుంబ్రిగూడ మండలం అరకు పంచాయతీ సర్పంచ్ శారదకు జాతీయ స్థాయి ఉత్తమ సర్పంచ్ అవార్డు లభించింది. ఈనెల 11న ఢిల్లీలోని అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 13 మంది ఎంపిక కాగా, అల్లూరి జిల్లా నుంచి ఆదివాసీ మహిళా సర్పంచ్‌గా తనను ఎంపిక చేయడం ఆనందంగా ఉందని శారద సోమవారం తెలిపారు.