ప్రకాశం: మార్కాపురంలోని జార్జి ఫార్మసీ కళాశాలలో రేపు జాబ్ మేళా జరగనున్నట్లు నిర్వాహకులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. B. Pharmacy, M. Pharmacy, B.Sc, M.Sc, B.Tech విద్యార్హతలు కలిగిన విద్యార్థులు హాజరు కావాలన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, పాస్ ఫొటోలు అలాగే జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.