VSP: ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఈనెల 11న జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిల పక్షాలతో కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్ష చేపడుతుందని జిల్లా అధ్యక్షుడు హాసిని వర్మ రాజు తెలిపారు. శనివారం విశాఖ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. గాంధీ పేరు తొలగించడం సరికాదని, పథకాన్ని యథాతధంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.