PPM: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉల్లాస్, అక్షరాంధ్ర, కుటుంబ సర్వేలను త్వరితగతిన పూర్తి చేయాలని కొమరాడ ఎంపీడీవో రమేష్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం గుమడ, కొమరాడ గ్రామ సచివాలయాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిబ్బందితో మాట్లాడుతూ.. సర్వేలను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు.