సత్యసాయి: బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా పుట్టపర్తిలో YCP ఎస్సీ సెల్ నాయకులు వినూత్న నిరసన చేపట్టారు. రాష్ట్రంలో దళిత మహిళలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ అర్ధనగ్నంగా రోడ్డుపై బైఠాయించి భిక్షాటన చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో దళితులకు రక్షణ కరువైందని వారు ఆరోపించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.