W.G. పెనుమంట్ర మండల కేంద్రంలో ఉన్న రాజీవ్ కాలనీ దళితులకు చెందిన స్మశాన వాటికను మంగళవారం సీపీఎం జిల్లా బృందం పరిశీలించింది. అనంతరం దళితులకు స్మశానవాటికను కేటాయించాలని కోరుతూ.. పెనుమంట్ర MRO కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. అలాగే సీపీఎం జిల్లా పాదయాత్ర బృందం MROకి వినతిపత్రం అందజేయడం జరిగింది.