TPT: చంద్రగిరి గ్రామ దేవత శ్రీ మూలస్తాన ఎల్లమ్మ తల్లిని శనివారం MLA పులివర్తి నాని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈనెల 17న ఆలయంలో అమ్మవారి కొండ చుట్టు ఉత్సవం ఘనంగా జరగనుంది. సంబంధిత పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. భక్తులకు తగు ఏర్పాట్లు చేయాలని సూచించారు.