అనంతపురం రూరల్ మండలం కురుగుంటలో వైసీపీ నేత వడ్డే పెద్దన్న వేధింపులకు పాల్పడుతున్నాడంటూ బాధిత మహిళలు జిల్లా ఎస్పీ జగదీష్‌కు ఫిర్యాదు చేశారు. నిందితుడు బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఫొటోలు తీస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే చంపేస్తామని బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు స్వీకరించిన అధికారులు దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.