SKLM: ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. సోమవారం చైత్ర బహుళ ఏకాదశి పురస్కరించుకొని స్వామి వారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, ఆలయ కార్యనిర్వాహణాధికారి ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు.