NLG: కెమికల్ ఫ్యాక్టరీల వల్ల తీవ్ర కాలుష్యం విస్తరిస్తోందని ఆరోపిస్తూ జగ్గయ్య పేటలోని శాంతినగర్, విష్ణుప్రియనగర్, ఆటోనగర్, డీవీఆర్నగర్ ప్రాంతాల ప్రజలు సోమవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. రాత్రి వేళ విషవాయువుల కారణంగా ఊపిరాడక ఇబ్బందులు పడుతున్నామని, గత 15ఏళ్లుగా కిడ్నీ, శ్వాసకోశ సమస్యలు, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.