VSP: సింహాచలం నుంచి విజయనగరంలో రామతీర్థం సీతారాముల కళ్యాణానికి ఈఓ వెంకట్రావు దంపతులు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతో బయలుదేరారు. సింహాద్రి అప్పన్న సన్నిధి నుంచి రామతీర్థానికి పట్టువస్త్రాలు తీసుకువెళ్లడం ప్రతి సంవత్సరం వస్తున్న ఆనవాయితీ అని అధికారులు తెలిపారు. నాదస్వర వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛారణల నడుమ వైభవంగా పట్టువస్త్రాలు ఊరేగింపుగా తీసుకువెళ్లారు.