ప్రకాశం: పొదిలిలో శనివారం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు ఎన్రోల్మెంట్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు పాఠశాలలను, విద్యార్థుల గృహాలను సందర్శించారు. విద్యార్థులందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేలా చూడాలని ఉపాధ్యాయులను, తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని HM కరీమున్ బీబీ తెలిపారు.