కృష్ణా: వేసవి ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా గ్రామాల్లో ఎక్కడ కూడా ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. నందివాడ మండలంలో శనివారం ఎమ్మెల్యే పర్యటించారు. దోసపాడు ఛానల్ ద్వారా తాగునీటి అవసరాలకు విడుదల చేసిన నీటి సరఫరాను ఆయన పరిశీలించారు.