ATP: గుంతకల్లులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో వర్చువల్ టీడీపీ మహానాడు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం టీడీపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఇంధన పొదుపు సాంకేతికత వినియోగం నేపథ్యంలో ఈ ఏడాది మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహిస్తున్నామన్నారు.