సత్యసాయి: అమరాపురంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. తముడేపల్లి గ్రామ సమీపంలో బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. రోళ్ల మండలం HT.హళ్లి గ్రామంలో నామకరణ వేడుకకు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.