SKLM: జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ తన వ్యక్తిగత పని నిమిత్తం సెలవుపై వెళ్లారు. శుక్రవారం నుంచి ఈ నెల 31 వరకు కుటుంబ సభ్యులతో విదేశీ పర్యటనకు వెళ్లడానికి ప్రభుత్వం అనుమతించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ను జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్గా నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి.