అన్నమయ్య: మదనపల్లె మండల పరిసర ప్రాంతాల్లో చెరువులు, నదులు, కాలువలపై ఏర్పాటైన అక్రమ నిర్మాణాలను తొలగించాలని బీవైఎస్ అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఇరిగేషన్ ఇంజనీర్లకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్రమ నిర్మాణాల కారణంగా పంట పొలాలకు సాగునీరు చేరక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.