HYD: బీజేపీ MPతేజస్వీ సూర్యపై చర్యలు తీసుకోవాలని DGP శివధర్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖ రాశారు. పార్లమెంట్లో తెలంగాణ ఏర్పాటును భారత్-పాకిస్థాన్ విభజనతో ఎంపీ పోల్చడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజా సామరస్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రాంతీయ విభేదాలను పెంచే అవకాశం ఉందని, తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.