BPT: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 9 పర్యటించనున్న నేపథ్యంలో జిల్లాలో ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. శనివారం జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ అధికారులతో కలిసి భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో పర్యటించారు. సభ వేదిక, హెలిప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించి, భద్రతా ఏర్పాట్లపై సూచనలు చేశారు.