KDP: చక్రాయపేట మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ గండి వీరాంజనేయస్వామి ఆలయాన్ని ఇవాళ ఉదయం భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని భక్తులు దర్శించుకుని, తీర్థ ప్రసాదాలు అందుకున్నారు. భక్తులు తలనీలాలు సమర్పించి పాపాగ్ని నదిలో స్నానమాచరించారు.