AKP: అచ్యుతాపురం నాలుగు రోడ్ల జంక్షన్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా గత నాలుగు రోజులుగా కొనసాగిన గడ్డర్లు పనులు పూర్తయ్యాయని సీఐ చంద్రశేఖర్ రావు తెలిపారు. దీంతో గురువారం ఉదయం నుంచి నాలుగు రోడ్ల జంక్షన్ సహా ఇతర మార్గాలపై అమల్లో ఉన్న ట్రాఫిక్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై అన్ని వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగించవచ్చన్నారు.