నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలోని 16 మున్సిపల్ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం “విజయదీపిక స్టడీ మెటీరియల్” పుస్తకాలను మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వై. ఓ నందన్ బహూకరించారు. నగరపాలక కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో గురువారం వివిధ పాఠశాలలకు చెందిన పదో తరగతి విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.