ATP: వర్చువల్ విధానంలో నిర్వహించే మహానాడును విజయవంతం చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పిలుపునిచ్చారు. ఈ వేడుకలపై అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. పొదుపు చర్యల్లో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తొలిసారిగా ఆన్లైన్ విధానంలో దీనిని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.