KRNL: ఓర్వకల్లు మండలం శకునాలలో తహసీల్దార్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సాగునీటి సంఘానికి ఎన్నికలు నిర్వహించారు. నామినేషన్లు టీడీపీ మద్దతుదారులు ఒకరే వేయడంతో నీటి సంఘం ఎన్నిక ఏకగీవ్రమైంది. సాగునీటి సంఘం అధ్యక్షుడిగా గణశ్యాంసుందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడుగా ఆకుల లక్ష్మయ్యతో పాటు సభ్యులు పుల్లయ్య, బీ. రాముడు, ఎం. రాముడు, వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.