TPT: తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలిలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి, ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ శిరీషతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను స్మరించుకుంటూ పార్టీ శ్రేణులతో కలిసి నినాదాలు చేశారు.