NLR: కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామంలో వీపీఆర్ నేత్ర కార్యక్రమం జరిగింది. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొన్నారు. ఆయన కంటి పరీక్షలు చేయించుకున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద, మధ్య తరగతి కుటుంబాలకు వీపీఆర్ నేత్ర వాహనం ద్వారా ఉచితంగా పరీక్షలు చేస్తున్నారని చెప్పారు. అవసరమైన వారికి కంటి అద్దాలు అందించడం హర్షించదగ్గ విషయమని కొనియాడారు.