E.G: రాజమండ్రి నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీస్ శాఖ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులులో ఆయన హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని తెలియజేసింది. అలాగే ఆయన స్థానంలో ఇంకా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం డీఎస్పీ శ్రీకాంత్ కు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదని సమాచారం.