VZM: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ ఎరుబోతు సురేశ్ కుమార్ను జాల్లా ఎస్పీ దామోదర్ మంగళవారం తన కార్యాలయంలో అభినందించారు. విధులకు వెళ్తున్న సమయంలో ఊటగెడ్డ వద్ద గాయపడిన గోపాల్ సింగ్ను గుర్తించి వెంటనే చికిత్స అందేలా చర్యలు తీసుకోవడంతో అతని ప్రాణాలు నిలిచాయి.