BPT: వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని అద్దంకి నియోజకవర్గ YCP సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్టు రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ప్రజాస్వామ్య హక్కులపై దాడి చేయడమేనని మండిపడ్డారు.