కృష్ణా: నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో ఇంటిపై విమానం దర్శనమిచ్చింది. చూడడానికి అచ్చం విమానం బొమ్మలా ఉన్నప్పటికీ ఇది విమానం కాదు. ఆ గృహ యజమాని తన ఇంటి నీటి అవసరాల నిమిత్తం వాటర్ ట్యాంక్‌ను విమానం ఆకారంలో తయారు చేయించారు. దీంతో ఆ మార్గం గుండా వెళుతున్న ప్రతి ఒక్కరు ఈ విమానం ఆకారంలో ఉన్న వాటర్ ట్యాంక్‌ను ఆసక్తిగా గమనించడం పరిపాటిగా మారింది.