కృష్ణా: సహకార శాఖ మంత్రిగా సహకార ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచి సహకార రంగాన్ని పునరుజ్జీవింపచేసిన మహనీయుడు ఎంవీ కృష్ణారావు అని ఏఎంసీ ఛైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. అవనిగడ్డలో మంగళవారం ఉమ్మడి రాష్ట్ర మాజీ మంత్రి దివంగత మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా నీటి సంఘాల అధ్యక్షులు, కూటమి నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు.