ప్రకాశం: అద్దంకి (మం) తిమ్మాయిపాలెం ఇటుక బట్టి సమీపంలో ఉన్న ఓ ఇంట్లో దోపిడీ జరిగింది. ఇంట్లో నాలుగు లక్షల రూపాయల నగదు ఆరు సవర్ల బంగారం పోయినట్లు కుటుంబ సభ్యులు పోలీసులుకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. సీఐ సుబ్బరాజు దొంగతనం జరిగిన ఇంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకున్నారు.